హువావే తన వై9ఎస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లపై లుక్ వేస్తారా..?

సరికొత్త మోడల్స్ తో తక్కువ ధరలలో ఫోన్లను అందించే హువావే..తాజాగా వై9ఎస్ స్మార్ట్ ఫోన్ ని ఇండియా లో విడుదల చేసింది. ఆక్టాకోర్ కిరిన్ 710f ప్రాసెసర్, వెనకవైపు ట్రిపుల్ కెమెరా, పాపప్ సెల్ఫీ కెమెరా ఫీచర్లు దీని ప్రత్యేకతలు. అలాగే ఇందులో కేవలం 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.19,990గా నిర్ణయించారు.

మరిన్ని ఫీచర్స్ చూస్తే..

* 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అల్ట్రా ఫుల్ వ్యూ డిస్ ప్లే
* స్క్రీన్ రిజల్యూషన్ 2340×1080 పిక్సెల్స్
* స్క్రీన్ టు బాడీ రేషియో 91 శాతం
* ఫింగర్ ప్రింట్ స్కానర్
* ఆక్టాకోర్ కిరిన్ 710F ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.