మొబైల్ బిజినెస్ ని మూసివేస్తున్న ఎల్జీ

ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్. (ఎల్జీ) తన మొబైల్ బిజినెస్ యూనిట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈరోజు ఉదయం ఆమోదించింది.

ఎక్కువ కాంపిటీషన్ ఉన్న మొబైల్ ఫోన్ రంగం నుండి నిష్క్రమించి, ప్రస్తుతం గ్రోత్ ఎక్కువగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్, కనెక్టెడ్ డివైసెస్, స్మార్ట్ హోమ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బిజినెస్-టు-బిజినెస్ సొల్యూషన్స్, అలాగే ప్లాట్‌ఫాంలు మరియు వృద్ధి రంగాలలో తమ సేవలు అందించే దిశగా అడుగులు వేస్తుంది.

ప్రస్తుత ఎల్జీ మొబైల్ వినియోగదారుల కోసం ఎల్జీ కొంతకాలం సేవా మద్దతు మరియు సాఫ్ట్‌వేర్ నవీకరణలను ప్రాంతాల వారీగా అందిస్తుంది. మొబైల్ ఫోన్ వ్యాపారం మూసివేసేటప్పుడు ఎల్జీ సరఫరాదారులు మరియు వ్యాపార భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. ఉద్యోగుల ఉపాధికి సంబంధించిన వివరాలు స్థానిక స్థాయిలో నిర్ణయించబడతాయి .

ఎల్జీ మొబైల్ ఫోన్ వ్యాపారం మూసివేత కార్యక్రమం జూలై 31 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు, అయినప్పటికీ ఇప్పటికే ఉన్న కొన్ని మోడళ్ల జాబితా ఇంకా అందుబాటులో ఉండవచ్చు.