లాక్‌డౌన్ తర్వాత తొలి ఫోన్ సేల్ ఇదే..

కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అనేక సంస్థలు మూతపడ్డాయి.అలాగే ఈ కామర్స్ సైట్స్ కూడా బంద్ కావడం తో ప్రజలు తిప్పలు అన్ని ఇన్ని కావు. ఇక ప్రస్తుతం కేంద్రం మినహాయిపులతో కూడిన లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలుకు కాస్త ఊరట గా ఉంది.ఈ నేపథ్యంలో ఆన్లైన్ లో ఈరోజు నుండి రెడ్‌మీ నో 9 ప్రో ఆన్‌లైన్‌ సేల్ ప్రారంభం అయ్యింది. ప్రభుత్వం లా క్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత తొలి స్మార్ట్‌ఫోన్ సేల్ విశేషం.

ఫీచర్లు చూస్తే..

* ఇక రెడ్‌మీ నోట్ 9 ప్రో విశేషాలు చూస్తే షావోమీ రెండు నెలల క్రితం రెడ్‌‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి.

* ఈ రెండు ఫోన్లలో ఇస్రోకు చెందిన నావిక్ టెక్నాలజీ ఉంది. స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాససెర్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5020 ఎంఏహెచ్ ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి.

* రెడ్‌మీ నోట్ 9 ప్రో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

* రెడ్‌‌మీ నోట్ 9 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2400×1080 పిక్సెల్స్ డిస్‌ప్లే ఉండటం విశేషం. రెడ్‌‌మీ నోట్ 9 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

* రెడ్‌‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 48 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే కెమెరా ఉండటం విశేషం.

* రెడ్‌‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5020 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది

* రెడ్‌‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.

* రెడ్‌‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ+64జీబీ ధర రూ.13,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.16,999. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొన్నవారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.