ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ అందిస్తూ వినియోగదారులను కట్టిపడేసే ఒప్పో..తాజాగా ఎ91 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర వచ్చేసి 20వేలకు లభ్యం కానుంది. డిసెంబర్ 26వ తర్వాత అందుబాటులోకి రానున్నట్లు సంస్థ తెలిపింది.
ఇక ఫీచర్లు చూస్తే..
* 6.4 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే
* ఆక్టాకోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 48 మెగాపిక్సల్ మెయిన్ బ్యాక్ కెమెరా
* ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లు ఉన్నాయి.