కరోనా దెబ్బ కు స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి..

కరోనా దెబ్బ ప్రతి దాని మీద పడుతుంది. సినిమా హాల్స్ , షాపింగ్ మాల్స్ , రవాణా వ్యవస్థ , బిజినెస్ ఇలా ప్రతిదీ మూతపడేసరికి ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది. తాజాగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా పడినట్లు గ్లోబల్‌ ఇండస్ట్రీ అనాలిసిస్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌ తెలిపింది.

ఫిబ్రవరి నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసిన నివేదిక లో ఆపిల్‌ ఫోన్లతోపాటు, ఇతర స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు 14 శాతం తగ్గిపోయినట్లు తెలిపింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ పరిస్థితి నెలకొందని వివరించింది. ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌ తన ప్రధాన మార్కెట్‌ అయిన చైనాలో ఫిబ్రవరి నెలలో 5 లక్షలలోపే అమ్మకాలు జరగలిగింది. ఇది గతేడాదితోపోల్చితే 38 శాతం తక్కువ. దీనికితోడు ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా మినహా ప్రపంచ దేశాలపై కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపుతుండటంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు మరింత క్షీణించే అవకాశం కనిపిస్తుందని తెలిపింది.