మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయో ఇలా తెలుసుకోండి…

ఈ రోజుల్లో మొబైల్ నంబర్లు వాడకం బాగా పెరిగిపోయింది. మన పేరు మీద ఎన్ని నంబర్లు ఉన్నాయో మనకే తెలీదు. కానీ ఇప్పుడు మన పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైటు ని విజయవాడ టెలికాం విభాగం రూపొందించింది. https://tafcop.dgtelecom.gov.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేసి అందులో మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది, మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరు మీద ప్రస్తుతం ఎన్ని నుంబర్లు ఆక్టివేట్ అయి ఉన్నాయో చూపిస్తుంది. అందులో మనం వాడని నుంబర్లు ఉంటె వాటిని క్లిక్ చేసి రిపోర్ట్ బటన్ ప్రెస్ చేస్తే టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది.

ఒక వ్యక్తి పేరు మీద 9 నుంబర్లు ఉండే వీలుంది, కానీ కొందరి పేరు మీద అంతకంటే ఎక్కువ నుంబర్లు ఉంటున్నాయని, ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు ఈ పోర్టల్ ని ప్రారంభించామని విజయవాడ టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో అక్రమంగా వాడుతున్న నుంబర్లకు చెక్ పడనుందని టెలికాం వర్గాలు తెలిపాయి. మొదటగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని తొందర్లో దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.