వివో మొబైల్ తయారు సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి ‘వివో వై95’ పేరిట నూతన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్లో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించడం విశేషం. ఈ ఫోన్ ధర రూ.16,990గా నిర్ణయించారు. ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎమ్, వివో ఇండియా ఇ-స్టోర్లలో ఈ ఫోన్లు వినియోగదారులకు లభ్యం కానుంది. స్టర్రీ బ్లాక్, నెబులా పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ ను అందిస్తున్నారు.
‘వివో వై95 ‘.. ఫీచర్లు చూస్తే.
* 6.22 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* క్వాల్కమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 1520 x 720 స్క్రీన్ రిజల్యూషన్
* 13 + 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 4జీ వీవోఎల్టీఈ
* బ్లూటూత్ వి4.2
* జీపీఎస్
* 4030 ఎంఏహెచ్ బ్యాటరీ