పెళ్లి ‘దేశ ముదురు ‘ భామ క్లారిటీ

దేశ ముదురు చిత్రం తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాపిల్ బ్యూటీ హన్సిక..తెలుగు లో కన్నా తమిళం లో బాగా పాపులర్ అయ్యింది. ఈమెకు అక్కడి ప్రేక్షకులు వీరాభిమానులు అయ్యారు. తమ ఆరాధ్య దేవతగా కొలిచే స్థాయికి హన్సిక ఎదిగిందంటే అర్ధం చేసుకోవాలని ఆమె ఎంత స్టార్ హీరోయిన్ అయ్యిందో..రీసెంట్ గా ఈ భామ సందీప్ కిషన్ కు జోడిగా తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా గతంలో హీరో శింబుని ప్రేమించిన ఈమె ఎందుకో అతనితో విడిపోయింది. కాగా ఈ మధ్య హన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు రావడం జరిగింది. వాటిపై హన్సిక స్పందించారు. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో అర్థం కాదు. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు … నాకు పెళ్లి కుదిరితే మీకు ముందే చెపుతానని క్లారిటీ ఇచ్చింది.