పాయల్ కరోనా డ్రెస్ ..

RX 100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన పాయల్ రాజ్ పుత్..మొదటి సినిమాతోనే ఎంత కిక్ ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ భామ ఇచ్చిన కిక్ ఇప్పటికి యూత్ మరచిపోలేకపోతున్నారు. రీసెంట్ గా వెంకిమామ , డిస్కో రాజా చిత్రాలతో ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ భామ గుణశేఖర్ దగ్గర పనిచేసిన ప్రాణదీప్ అనే దర్శకుడు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తుంది. ఈ మూవీ ఓ లేడీ ఓరియెంటెడ్ గా రాబోతుంది. ఇందులో పాయల్ ఐపిఎస్ అధికారిణిగా నటిస్తుంది.

మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లన్ని ఆగిపోవడం తో సినీ స్టార్స్ అంత ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడం తో అంత బయటకు వస్తున్నారు. తాజాగా పాయ‌ల్ ముంబైలోని త‌న ఇంటికి వెళ్లేందుకు ఎర్ర‌టి పీపీఈ కిట్ ధ‌రించి ఫ్లైట్ ఎక్కింది. ముంబైలో దిగ‌గానే ఫోటోల‌కి ఫోజులిచ్చింది. వీటిని త‌న ఇన్‌స్టాగ్రాములో షేర్ చేస్తూ.. అమ్మ‌, నేను వ‌చ్చేస్తున్నాను అని కామెంట్ పెట్టింది.