పెళ్లి ఫై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

ఫిదా చిత్రం తో అందర్నీ ఫిదా చేసిన మలయాళ బ్యూటీ సాయి పల్లవి..మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కేవలం వెండితెరపై మాత్రమే కాదు యూట్యూబ్ లో కూడా అమ్మడు చాల ఫేమస్. అలాంటి ఈ భామ ప్రస్తుతం వేణు ఊడుగుల డైరెక్షన్లో ‘విరాట పర్వం’ చేస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి స్పందించి షాక్ ఇచ్చింది. సాయి పల్లవి.. అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకోదంట. తాను పెళ్లి చేసుకోవాలన్న ప్లాన్ ఏమి లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చింది. తాను ఎప్పటికీ తన తల్లిదండ్రులతోనే ఉండాలని కోరుకుంటుందంట. పెళ్లి చేసుకుంటే కుదరదని.. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకుంటుందట.