ఓపెన్ జిమ్‌లో దెయ్యం వ్యాయామం..

దెయ్యం పేరు వింటేనే హడలిపోతాం..అలాంటిది ఓపెన్ జిమ్ లో దెయ్యం వ్యాయామం చూస్తే ఇంకేమైనా ఉందా..ఈ సంఘటనే ఝాన్సీ ప్రాంతంలోని కాశీరామ్ పార్కులో జరిగింది. కాశీరామ్ పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ యంత్రం దానికదే కదులుతుండటంతో దెయ్యమే కసరత్తు చేస్తోందని ప్రచారం జరిగింది. ఇది నిజమేనని చాలామంది నమ్మేశారు. దీంతో అక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయనే భయంతో వణికిపోయారు. ఆ పార్కులోకి ఎవ్వరూ రావట్లేదు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అలా ఆ జిమ్ యంత్రం దగ్గరకొచ్చారు. అది నిజ్జంగానే ఎవ్వరూ లేకుండా అది కదలం..టకా టకా సౌండ్ కూడా రావటం గమనించారు. ఆ యంత్రం ఈజీగా కదలటానికి ఎవరో గ్రీజు ఎక్కువగా పూయటం వల్ల యంత్రం దానికదే కదలుతూ..అలా ఆగకుండా అటూ ఇటూ కదులుతూ టకా టకా సౌండ్ వస్తోందని తేల్చేశారు. దెయ్యంలేదు భూతం లేదంటూ చెప్పారు. అందరూ ధైర్యంగా వచ్చి కసరత్తులు చేసుకోవచ్చంటూ భరోసా ఇచ్చారు. దీంతో స్థానికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.