డిప్రెషన్ ఫై అనుష్క స్పందన..

బాలీవుడ్ సుశాంత్ ఆత్మ హత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో సంచలనం రేపుతోంది. ఇప్పుడిప్పుడే అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఆత్మ హత్య చేసుకోవడం ఏంటి అని పలువురు మాట్లాడుకుంటున్నారు. 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 2002లో సుశాంత్ తల్లి చనిపోయింది. దీంతో తండ్రి సంరక్షణలో అన్న, సోదరిలతో కలసి అతను పెరిగాడు.

సుశాంత్ గతకొంత కాలంగా బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతని మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదని.. అందుకే ఉరేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్స్ కూడా గతంలో తాము డిప్రెషన్ కు లోనయినట్లుగా పేర్కొన్నారు. తాజాగా అనుష్క శెట్టి స్పందిస్తూ .. డిప్రెషన్ గురించి కాస్త ఎక్కువ వివరణ ఇచ్చింది.ఆ పరిస్థితుల నుండి బయట పడేందుకు కష్టపడాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి జీవితం ఫర్ ఫెక్ట్ గా లేదని అనుష్క చెప్పుకొచ్చింది. డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఇతరులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా సరదాగా ఎవరితో అయితే గడుపుతారో వారిని మీ వద్ద ఉంచుకోవాలి. ఎదుటి వారు ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా వారిని చూసి చూడనట్లుగా వదిలేయకుండా వారితో సమయంను గడిపేందుకు ప్రయత్నించండి అంటూ అనుష్క సలహాలు ఇచ్చింది.