మంచు లక్ష్మికూతురికి డార్లింగ్ షాక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ..మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణకు సర్ప్రైజ్ షాక్ ఇచ్చాడు. తాజాగా లక్ష్మి తన కూతురు విద్యా నిర్వాణ పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

కాగా పుట్టినరోజు సందర్భంగా తన కూతురుకు ప్రభాస్ వీడియో కాల్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడని అంతే కాకుండా కాసేపు సరదాగా మాట్లాడాడని చెప్పుకొచ్చింది. ప్రభాస్ వీడియో కాల్ చేయడంతో విద్యా నిర్వాణ చాలా ఆనందపడిందని ..ఫ్యామిలీ సభ్యులతో ప్రభాస్ మాట్లాడాడని తెలిపింది.