బాలీవుడ్ ఇండస్ట్రీ ఫై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకోవడం తో ఇండస్ట్రీ లోని చీకటి కోణాలు బయటపడుతున్నాయి. ఇండస్ట్రీ లో కొత్త వారికీ ఛాన్సులు ఇవ్వరని ..కొంతమంది వ్యక్తులు కావాలని వారికీ అవకాశాలు రాకుండా చేస్తారని ఆలా చేసినవారు కూడా ఉన్నారని కొంతమంది పేర్లు సైతం పలువురు బయటపెట్టారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ బాలీవుడ్ ఇండస్ట్రీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యింది.

ఈ నేపథ్యంలో హిందీ సినిమాల్లో ఎందుకు నటించలేదన్న దానికి స్పందిస్తూ రమ్యకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నిజానికి నా సినిమాలు ఉత్తరాదిలో సరిగ్గా ఆడలేదు. అక్కడ నాకు వచ్చిన ఆఫర్లు కూడా ఆసక్తికరంగా లేవు. అందుకే ఇన్నేళ్లు నటించలేదు. దక్షిణాదిలో నేను విజయవంతంగా రాణిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.