చీరలో సింగారాన్ని చూపిస్తున్న శృతి హాసన్

కమల్ కూతురి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన శృతి హాసన్..కెరియర్ మొదట్లోనే ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకొని..ఆ తర్వాత గోల్డెన్ గా లెగ్ మారింది. వరుస సక్సెస్ లు అమ్మడిని పలకరించడం తో అగ్ర హీరోల ఛాన్సులు తలుపు తట్టాయి. కానీ అమ్మడు మాత్రం వాటిని కాదని ప్రేమలో పడి సినిమాలకు దూరం అయ్యింది. ఇక ప్రేమ విఫలం కావడం తో మళ్లీ సినిమాల ఫై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం తెలుగు లో రవితేజ సరసన క్రాక్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ అయినా ఈ భామ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా చీర కట్టులో తన సింగారాన్ని అంత చూపించి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.