జూలై రెండో వారం నుండి ఆ థియేటర్స్ ఓపెన్ కాబోతున్నాయా…?

లాక్ డౌన్ కారణంగా మూడు నెలలుగా మూతపడిన థియేటర్స్ మళ్లీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ..సినీ ప్రేమికులు మాత్రం సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే జులై రెండో వారం నుండి ఐనాక్స్, పివిఆర్ థియేటర్స్ ఓపెన్ కాబోతున్నాయనే సంకేతాలు అందుతున్నాయి.

రెండు హాలీవుడ్ సినిమాల విడుదల నేపథ్యంలో, ప్రతి మల్టీ ఫ్లెక్స్ ల్లో ఒక స్క్రీన్ ను తెరిచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశం మొత్తం మీద ఐనాక్స్, పివిఆర్ మల్టీ ఫ్లెక్స్ లు వున్నాయి. ఒక్కో స్క్రీన్ వంతున తెరిచినా పెద్ద సంఖ్యలో స్క్రీన్ లు అందుబాటులోకి వస్తాయి.

హాలీవుడ్ సినిమాల తరువాత పరిస్థితిని బట్టి, ఇండియన్ సినిమాల ప్రదర్శనతో స్క్రీన్ లు కొనసాగించే అవకాశం వుంది. తెలుగునాట కూడా సినిమా థియేటర్లు ఆగస్టు నుంచి తెరుచుకుంటాయని వినిపిస్తోంది.