సుశాంత్ ఆత్మ హత్య ఫై సల్మాన్ ఏమన్నాడంటే

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కొంతమంది వ్యక్తుల వల్లే సుశాంత్ మానసికంగా ఇబ్బందికి గురిఅయ్యాడని..దానివల్లే మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు , అభిమానులు కామెంట్స్ పెట్టడమే కాదు..దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ .. సల్మాన్ అతని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు.

`బీయింగ్ హ్యూమన్` అనే స్వచ్ఛంద సంస్థపై కూడా విమర్శలు చేశారు. తనపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. సుశాంత్ అభిమానులు ఉపయోగించిన భాష, వారు పెట్టిన శాపనార్థాల గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎంతో అభిమానించే వ్యక్తిని కోల్పోయిన వారి భావోద్వేగాన్ని అర్ధం చేసుకోవాలి. నా అభిమానులంతా సుశాంత్ కుటుంబం, అతని అభిమానుల పక్షాన నిలబడాలి అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.