
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భాంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి దుమ్ములేపారు. ఈ టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే చూపించడం తో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది.
తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ హడావిడి చేస్తుంది.ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.









