కీర్తి ని..కీర్తించిన రష్మిక

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం జూన్ 19 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. ముఖ్యముగా కీర్తి నటనకు మరోసారి అంత ఫిదా అయ్యారు. అనేక మంది చిత్ర ప్రముఖులు పొగిడారు.

తాజాగా ‘పెంగ్విన్‌’ మూవీ చూసిన రష్మిక చిత్ర యూనిట్ ని మెచ్చుకుంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్‌ పెట్టారు. గత రాత్రి ‘పెంగ్విన్‌’ చిత్రాన్ని చూశాను… కీర్తి.. నీ నటన మర్చిపోలేకపోతున్నాను. ఎప్పటిలాగానే ఈ చిత్రంలోనూ నువ్వు చాలా అద్భుతంగా నటించావు. ఆపదల నుంచి కుటుంబాన్ని సైరస్‌ రక్షించడం చాలా బాగుంది. ఈ సినిమా ప్రతి మదర్ కి సంబంధించిందని ఖచ్చితంగా చెప్పగలను. దర్శకుడు ఈశ్వర్‌ కార్తిక్‌, నిర్మాత కార్తిక్‌ సుబ్బరాజుతోపాటు ఇతర చిత్రబృందానికి అభినందనలు’ అని రష్మిక పోస్టు చేసింది.