
టెక్నాలజీ పుణ్యమా అనేక యాప్ లు వస్తూ హల్చల్ చేస్తున్నాయి. అమ్మాయిలను , అబ్బాయిలుగా, అబ్బాయిలను అమ్మాయిలుగా..యంగ్వారిని ముసలివారిగా ఇలా అనేక రకాలుగా మార్చే యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జెండర్ స్వాప్‌తో శృతి హాసన్ అబ్బాయిగా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టడం నెటిజన్స్‌కి కాస్త కష్టతరమైంది.
కొద్ది రోజులుగా ముంబైలోని తన నివాసంలో ఉంటున్న శృతి హాసన్ త్వరలో షూటింగ్స్‌తో బిజీ కానుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రవితేజ క్రాక్ చిత్రంతో పాటు గోపిచంద్ మలినేని సినిమాలు ఉన్నాయి. తమిళంలో లాభం అనే చిత్రం కూడా చేస్తుంది.









