సుశాంత్ సింగ్ నటించిన చివరి చిత్రం వచ్చేస్తుంది..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక విషయాలు బయటకొచ్చాయి. మానసిక ఇబ్బంది కారణంగానే ఆయన చనిపోయారని ..కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తులే ఆయన మరణానికి కారణమని అంత కామెంట్స్ వేస్తున్నారు. ఇదిలా ఉంటె సుశాంత్ నటించినా చివరి చిత్రం ఓటిటి లో రిలీజ్ కాబోతుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘దిల్ బేచరా’ సినిమా రిలీజ్ కాబోతోంది. జూలై 24న స్ట్రీమింగ్ కానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రైబర్స్ మరియు నాన్ సబ్స్క్రైబర్స్ అందరికి అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించారు.

వాస్తవానికి ‘దిల్ బేచారా’ సమ్మర్ కానుకగా మే 8న రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన వాయిదా పడింది. ముఖేష్ ఛబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు నిర్మించారు. ఈ సినిమా ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే నవల ఆధారంగా రూపొందింది. సుశాంత్ తో పాటు సంజన సాంఘి సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ – సంజన సాంఘి ఇద్దరూ క్యాన్సర్ పేషెంట్స్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.