
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మహేష్ ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన అడవి శేషు తో మేజర్ అనే సినిమా నిర్మిస్తున్నాడు.
ఈ మూవీ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రేణు దేశాయ్ ని తీసుకున్నారట. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది. గత కొన్నాళ్లుగా రేణు దేశాయ్…సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆమె ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాధ్ ని ఆయన చిత్రంలో ఓ రోల్ ఇవ్వాలని కోరారు. అలాగే మహేష్ బాబు చిత్రంలో కూడా నటించాలని ఉందని…రేణు తన కోరిక బయటపెట్టారు. ఇప్పుడు మహేష్ సినిమాలో నటించే దక్కించుకుంది.









