
మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ..అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడా..ప్రస్తుతం మెగా క్యాంపు లో ఇదే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం శివ..మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ మొదలు పెట్టిన దగ్గరినుండి అనేక అవాంతరాలు వస్తూ షూటింగ్ లేట్ అవుతుంది. కాగా ఈయన అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.
‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టి ఫుల్ జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. ‘పుష్ప’ తరవాత అల్లు అర్జున్.. కొరటాల శివతో సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. బన్నీ కోసం ఇప్పటికే కొరటాల శివ స్టోరీ లైన్ రాసుకున్నారట. ఇది అల్లు అర్జున్‌తో పాటు అల్లు అరవింద్‌కు విపరీతంగా నచ్చేసిందని అంటున్నారు. దీంతో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పైనే నిర్మించాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారట. అంతేకాదు, ఈ సినిమా కోసం కొరటాల శివకు ఏకంగా రూ.15 కోట్లు ఆఫర్ చేస్తున్నారని టాక్.









