ప్రభాస్ ఫ్యాన్స్ అప్పటివరకు ఆగాల్సిందేనా..?

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నుండి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ , రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టుకొని చాల నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమా తాలూకా ఎలాంటి అప్డేట్ అధికారికంగా ప్రకటించకపోయేసరికి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదిగా యూవీ క్రియేషన్స్‌ను ట్రోల్ చేసారు. వరస్ట్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో కాస్త హడావుడి కూడా చేసారు. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఏమాత్రం స్పందించలేదు. అయితే ఇక ఇప్పుడు అభిమానులు ఒకటి డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఎటూ ఇన్నాళ్ళు ఆగారు…మరో నాలుగు నెలలు ఆగి ప్రభాస్ పుట్టినరోజున అన్ని కలిపి గ్రాండ్ గా జరుపుకుంటే బెటర్ అనిపిస్తుంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే నేపథ్యంలో ఆ రోజు గ్రాండ్ గా మూవీ టీజర్ అండ్ టైటిల్ రావచ్చు. ఆలస్యం అయినా అప్పటివరకు వెయిట్ చేయించి ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇస్తారేమో అనిపిస్తుంది.