
లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్లు , అలాగే సీరియల్ షూటింగ్ లు ఇలా అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలు సూచిస్తూ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. దీంతో పలు సీరియల్స్ , చిన్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కరోనా వెంటాడుతుంది. ఇప్పటికే సీరియల్ నటుడు ప్రభాకర్ సైతం కరోనా బారిన పడ్డాడు.
అయితే తాజాగా మరో సీరియల్ నటుడు హరికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హరికృష్ణ ప్రస్తుతం గృహలక్ష్మీ సీరియల్‌లో నటిస్తున్నాడు. అయితే హరికృష్ణకు కరోనా అని తేలడంతో ఈరోజు జరగాల్సిన గృహలక్ష్మీ సీరియల్ షూటింగ్ కాన్సల్ అయ్యింది. హరికృష్ణ ఇటీవలే కరోనా సోకిన ప్రభాకర్‌తో కలిసి తిరిగాడని తెలుస్తోంది.









