నితిన్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బ కు ఇంట్లోనుండి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఇతర దేశాల్లో ఎక్కువగా గడిపే వారు సైతం ఎలాంటి టూర్స్ ప్లాన్ చేయడం లేదు. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ నితిన్ పెళ్లి ఫై పడింది.

ఏప్రిల్ 16 న నితిన్ దుబాయి లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ అంతటా ఉండడం తో పెళ్లి ని వాయిదా వేసుకున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఆషాడమాసం నడుస్తోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాడంలో పెళ్లిలు జరిపించరు. ఆషాడం తర్వాత శ్రావణ మాసం లేదా కార్తీక మాసంలో పెళ్లిలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నితిన్ పెళ్లిని ఆషాడం పూర్తి అయిన వెంటనే జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో పెళ్లికి సిద్దం అవుతున్నారు. అతి కొద్ది మంది బంధు మిత్రులను ఈ పెళ్లికి నితిన్ అండ్ ఫ్యామిలీ ఆహ్వానించబోతున్నారు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో నితిన్ షాలినిల వివాహం జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్.