
ఫిట్నెస్ విషయంలో సమంత చాల కేర్ తీసుకుంటుందనే సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదటి నుండి కూడా ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ చక్కటి అందం తో పాటు తన ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తుంది. రోజూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్నిజిమ్ కోసం కేటాయిస్తుంది.
తాజాగా సమంత యోగాసనం ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తోటపని కాకుండా నేను యోగాను కూడా ఇష్టపడతాను. నాగ చైతన్యతో కలిసి యోగ చేస్తాను అని సమంత పేర్కొన్నది. సమంత వేసిన యోగాసనం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.









