
బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నుండి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ , రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టుకొని చాల నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమా తాలూకా ఎలాంటి అప్డేట్ అధికారికంగా ప్రకటించకపోయేసరికి ఫ్యాన్స్ కాస్త ఆగ్రహం లో ఉన్నారు .
ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకు వచ్చి అభిమానులను సంతోష పెడుతుంది. ఈ సినిమాలో రానా ప్రత్యేక పాత్రలో రెండు నిముషాల పాటు కనిపించబోతున్నాడట. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ప్రభాస్ గోపిచంద్ ను అనుకున్నాడట. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు. ఈ చొరవతోనే గోపీని ప్రభాస్ అడిగారట. గోపీచంద్ అంగీకరించినా అనుకోని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడం కుదరడంలేదట. దీంతో ప్రభాస్‌కు మరో ఆప్షన్ కింద రానా ను ఓకే చేసినట్లు తెలుస్తుంది.









