
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమా తో స్వీటీనెటిజన్లను ఆకట్టుకుంది. అమ్మడి అందాల ఆరబోతకు సినీ అభిమానులు , సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. అసలు ఈ స్వీటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే పరిశోధనలో పడ్డారు. స్వీటీ అసలు పేరు శ్రీ రాపాక. ఇండస్ట్రీలో ముద్దుగా శ్రీ అనిపిలుస్తారట. ఈమెకు ఇండస్ట్రీతో మంచి అనుబంధమే ఉంది. టీవీ రంగంలోని సత్తా చాటిందట.
ఆ విషయాలను తెలియజేస్తూ.. ‘రంగస్థలం షోతో పాటు కబాడీ లీగ్స్‌లో పాల్గొన్నాను. స్టార్ వార్తో పాటు కిర్రాక్ కబాడీ ట్రోపీల విన్నర్‌ని నేను. ఆ తరువాత రంగస్థలం షో చేశా.. జెమినిలోనే టాప్ రేటింగ్ షో రంగస్థలంలో చాలా రోజులు చేశా. ఫైనల్ వరకూ వెళ్లా. బేసిక్‌గా నేను ఫ్యాషన్ డిజైనర్‌ని.. తెలుగు, కన్నడ, తమిళ్లో 40కి పైగా చిత్రాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశా. హైదరాబాద్ నిఫ్ట్‌లో చదువుకున్నా. మాస్టర్స్ యూఎస్‌లో చేశా. నిఫ్ట్‌లో చేస్తూనే సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశా. ఇంటర్మీడియట్ అవ్వగానే నిఫ్ట్ల్ జాయిన్ అయ్యా.. ఫస్ట్ ఇయర్ నుంచి సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నా.
దేశముదురు, చందమామ, యువత, నచ్చావులే ఇలా చాలా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా చేశా. వర్మ ‘నగ్నం’ చిత్రంలో అవకాశం వచ్చిందంటే.. రీసెంట్గా వలయం అనే సినిమాకి నేను క్యాస్ట్యూమ్ డిజైనర్. ఆ సినిమాలో చేసే ఓ ఆర్టిస్ట్ టైంకి రాకుండా హ్యాండ్ ఇచ్చింది. అదే టైం నన్ను చేయమని అడిగారు. నిజానికి నాకు చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేదు. ఫిదా సినిమాలో సాయి పల్లవి సిస్టర్‌గా చేయమని శేఖర్ కమ్ముల గారు అడిగారు.. కాని నేను చేయనని చెప్పాను. ఇష్టం లేదన్నా. అయితే వలయం సినిమా విషయంలో నన్ను బాగా బలవంతం పెట్టారు. దీంతో కాదనలేక ఆ సినిమాలో ఒక పాత్ర చేశా. అయితే ఈ సినిమాకి పనిచేసిన వెంకట్ అనే అబ్బాయి.. నగ్నం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతో నాకు మళ్లీ అవకాశం వచ్చింది’ అంటూ నగ్నం విశేషాలను తెలిపింది









