2022 లో మహేష్ మూవీ ..?

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని గత కొన్నేళ్లు గా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించారు రాజమౌళి. ఓ ఇంటర్వ్యూ లో నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తోనే అని ప్రకటించి అభిమానుల్లో ఆనందం నింపారు.

దుర్గ ఆర్ట్స్ బేనర్‌పై కేఎల్ నారాయణ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘దానయ్య గారితో సినిమా తర్వాత … నారాయణ గారితో చేయాలి. నారాయణ గారు, నేను మహేష్ బాబు కాంబినేషన్ అని ఎప్పట్ని నుంచో చెప్తున్నదే’ అంటూ టీవీ ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్య్వూలో రాజమౌళి తెలిపారు. ఈ కబురు తెలిపిన దగ్గరి నుండి అభిమానులు తెగ సంబరాలు జరుపుకున్నారు. 2021 లో ఈ మూవీ మొదలుకావాల్సివుంది. కానీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడింది. దీంతో రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ కు బ్రేక్ పడింది. ఈ సినిమా వాయిదా ఎఫెక్ట్ మహేష్ మూవీ ఫై పడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 2022 లో మహేష్ సినిమా స్టార్ట్ చేయాలనీ రాజమౌళి అనుకుంటున్నాడట .