సుశాంత్ మరణంపై భూమిక ఎమోషనల్ ట్వీట్

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కాగా సుశాంత్ సూసైడ్ ఫై ఖుషి ఫేమ్ భూమిక ఎమోషనల్ అయ్యారు.

”దాదాపు 20 రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ నీ ఆలోచనలతోనే నిద్ర లేస్తున్నాను. నీతో కలిసి పనిచేసింది ఒక్క సినిమాలోనే అయినా ఇప్పటికీ మరచిపోలేకపోతున్నా. అవును సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం అంత సులువైన విషయం కాదని నేను అంగీకరిస్తున్నా. ఈ ప్రపంచంలో మనల్ని గౌరవించే వారితో పాటు వ్య‌తిరేకించే వారు కూడా ఉంటారు. వ్య‌తిరేకించే వాళ్ళను పక్కనబెట్టి ముందుకు సాగిన‌పుడే జీవితం ఆనంద‌ంగా ఉంటుంది. ఏదేమైనా గుడ్ బై సుశాంత్.. నువ్వెక్కడున్నా నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నా” అని తన లేఖలో రాసింది భూమిక.

`ధోనీ` సినిమాలో సుశాంత్‌తో కలిసి నటించింది భూమిక. ఈ మూవీలో భూమిక, సుశాంత్‌ అక్కాతమ్ముళ్లుగా నటించారు. ఆ ఒక్క సినిమాతోనే సుశాంత్‌తో మంచి అనుబంధం ఏర్పర్చుకుంది భూమిక.