మాజీ నక్సలైట్ గా చరణ్..?

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో ఆచార్య మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సినిమా తాలూకా అనేక విషయాలు బయటకొస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 40 శాతం పూర్తి కాగా..లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ మూవీ లో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతాడని అంటున్నారు. అలాగే చిరంజీవి ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కనిపించబోతాడని.. కాకపోతే పది నిముషాల ప్లాష్ బ్యాక్ లో మాత్రమే అలా కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫిల్మ్ సిటీలో మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొననుంది. ఇఅలాగే రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తుండగా ..మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.