మహా సముద్రం స్క్రిప్టు పనులు పూర్తి ..

RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి…మొదటి సినిమాతోనే ఎంత క్రేజ్ తెచ్చుకోవాలో అంత తెచ్చుకున్నాడు. కేవలం ఆయన మాత్రమే కాదు..ఈ సినిమాలో నటించిన హీరో కార్తికేయ..హీరోయిన్ పాయల్ కు సైతం ఎంతో క్రేజీ వచ్చింది. అజయ్…మహాసముద్రం టైటిల్ తో ఓ కథ సిద్ధం చేసి ఎప్పటి నుండి ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. కానీ అది వర్క్ అవుట్ కావడం లేదు. హీరోలు ఒక అనేలోపు నిర్మాతలు చేజారిపోతున్నారు.

ఇద్దరు ఓకే అనుకునేలోపు హీరోయిన్ మిస్ అవుతుంది..ఇలా పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం అన్ని అవాంతరాలు తొలగిపోయాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.