వర్మ కు మరో బ్యూటీ దొరికిందోచ్

లాక్ డౌన్ వేళా వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు వర్మ . క్లైమాక్స్ , నగ్నం సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం పవర్ స్టార్ , మర్డర్ చిత్రాలను ప్రకటించాడు. తాజాగా కొత్త సినిమా హీరోయిన్ ను వర్మ పరిచయం చేశాడు. ఒడిశాకు చెందిన అప్సర రాణి అనే యువతిని తన కొత్త సినిమా హీరోయిన్ గా పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా వరుస ట్వీట్స్ చేశాడు.

శ్రీ రాపాకను హీరోయిన్ గా పరిచయం చేసి ఆమెను ఓవర్ నైట్ లో సెలబ్రెటీని చేసిన వర్మ ఇప్పుడు అప్సర ను హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.