
లాక్ డౌన్ కారణంగా సినీ నటి నటులకు ఫుల్ రెస్ట్ దొరికింది. గత మూడు నెలలుగా షూటింగ్ లు ఆగిపోవడం తో ఇంటికే పరిమితమయ్యారు. నటీమణులంతా వంటకాలతో బిజీ గా ఉంటె..హీరోలు కొత్త కథలు వింటున్నారు. ఇక రౌడీ విజయ్ దేవరకొండ విషయానికి వస్తే కెరియర్ మొదట్లో సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈయన..గత మూడు నెలలుగా సోషల్ మీడియా లో కనిపించడం , ట్వీట్స్ చేయడం తగ్గించాడు.
ఇటీవల ఫాదర్స్ డే సందర్బంగా ఒక ఫొటోతో నెటిజన్స్ ముందుకు వచ్చాడు. ఆ ఫొటో లో ఆయన హెయిర్ స్టైల్ మరియు గడ్డంతో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు. విజయ్ దేవరకొండ తన టీంతో చర్చిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఫొటోలో విజయ్ దేవరకొండ చాలా రిలాక్స్ గా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. షూటింగ్ కు ఎప్పుడు వెళ్లాలి.. కొన్ని యాడ్ షూట్స్ కూడా ఉన్నాయనే టాక్. వాటికి సంబంధించిన విషయాలను కూడా తన టీంతో చర్చిస్తున్నట్లుగా ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది.









