మేకప్ మెన్ కు బర్త్ డే విషెష్ అందించిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు అందరితో చాల క్లోజ్ గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ఆయన దగ్గర పనిచేసే వారితో కూడా చాల మర్యాద గా ఉంటారని..ఎవర్ని తక్కువ చేసి చూడడం వంటివి చేయడని అంత చెపుతుంటారు. తాజాగా అది నిజమే అని మరోసారి రుజువు చేసారు. తాజాగా మహేష్ తన మేకప్ మెన్‌కి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. పట్టాభి అనే మేకప్ మెన్ ఎప్పటి నుండో మహేష్‌కి పర్సనల్ మేకప్ మెన్‌గా పని చేస్తుండగా, ఆయన బర్త్‌డేని గుర్తు పెట్టుకొని విష్ చేయడంతో ఫ్యాన్స్ మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

“హ్యాపీ బర్త్‌డే పట్టాభి. షూట్ మొదలైనప్పటి నుండి లాస్ట్ టచ్ అప్ వరకు నాతో ఉండే పట్టాభి ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మహేష్ అతనితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ విషెస్ ” అందించారు. ప్రస్తుతం మహేష్ పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ఓపెనింగ్స్ పూర్తి కాగా.. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.