వర్మ ‘పవర్ ‘ చూపిస్తున్నాడు..

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ..లాక్ డౌన్ ను పూర్తిగా వాడుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడడం తో సినీ ప్రేమికులు ఓటిటి కి అలవాటుపడ్డారు. దీంతో చాలామంది దర్శక , నిర్మాతలు ఓటిటి లో సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
వర్మ సైతం ఓ యాప్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ యాప్ కి ఆర్ జి వి వరల్డ్ థియేటర్ అనే పేరును పెట్టుకున్నాడు.

ఇప్పటికే ఆ యాప్ లో కొద్దిరోజుల వ్యవధిలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తెరకెక్కించి విడుదల చేసాడు. కాగా ఇప్పుడు ఆయన “పవర్ స్టార్” పేరిట మరో సినిమాను రిలీజ్ చేయబోతున్నడు. వర్మ “పవర్ స్టార్ ఫస్ట్” సినిమా లుక్ పోస్టర్ ను విడుదల చేసాడు. పోస్టర్ లో ఎన్నికల ఫలితాల తరవాత కథ అంటూ రాతలు ఉన్నాయి. ఈరోజు ఉదయం నుండి ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , స్టిల్స్ ఒక్కోటిగా రిలీజ్ చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. కొద్దీ సేపటి క్రితం మరో పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చిరంజీవి లాగా ఉన్న మరో వ్యక్తిని పరిచయం చేసాడు.