మలయాళ రీమేక్ లో విశ్వక్‌ సేన్..?

ఇతర భాషల్లో సూపర్ హిట్ అయినా చిత్రాలను తెలుగు లో రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యముగా మలయాళంలో విజయం సాధించిన చిత్రాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇప్పటికే ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘లూసిఫర్’ రీమేక్ హక్కులను రామ్ చరణ్ కొనుగోలు చేశారు.

ఇక ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ సినిమా హక్కులను సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఇదే ప్రొడక్షన్ హౌజ్ ‘కప్పెల’ తెలుగు రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. కప్పెల’ రీమేక్ కోసం యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ను సంప్రదించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే, ప్రస్తుతం చర్చల దశలోనే ఉందట. ఇంకా విశ్వక్‌ సేన్ తన నిర్ణయాన్ని చెప్పలేదని అంటున్నారు.