ప్రభాస్ అభిమానుల్లో కొత్త టెన్షన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో రాధే శ్యామ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని గోపి కృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అబిమానుల్లో ఆనందం నింపారు. ఈ ఫస్ట్ లుక్ ఆలా వచ్చిందో లేదో సోషల్ మీడియా లో అభిమానులు రచ్చ మొదలు పెట్టారు. ఎన్నాళ్లగానో ఊరిస్తున్న అప్డేట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ మరియు రీట్వీట్స్ తో దుమ్మురేపాడు. దీనితో రాధే శ్యామ్ టైటిల్ 6.3 మిలియన్ ట్వీట్స్ దక్కించుకుంది. రోజంతా రాధే శ్యామ్ టైటిల్ ట్రెండింగ్ లో కొనసాగింది. ఐతే ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో కొత్త డౌట్ లు మొదలయ్యాయట.

రాధే శ్యామ్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ చాలా క్లాసిక్ గా ఉన్నాయి. ఇక ఇది పీరియాడిక్ సెన్సిబుల్ లవ్ డ్రామా అని దర్శకుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది పక్కా లవ్ క్లాసిక్ అయితే… ప్రభాస్ నుండి ఫ్యాన్స్ ఆశించే భారీ ఫైట్స్ మరియు మాస్ డైలాగ్స్ ఉంటాయా అనే సందేహం వారిలో మొదలయ్యింది.