బాలయ్య మూవీ లో ప్రిన్స్..?

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భాంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి దుమ్ములేపారు. ఈ టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే చూపించడం తో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది.

తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో ప్రిన్స్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రిన్స్ ప్రస్తుతం హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసామని.. సరైన టైమ్ లో వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.