రాజ్ కుమార్ రావ్ హీరోగా హిట్

ఓ పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాత గా సినిమాలు నిర్మిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ బ్యానర్ ప్రారంభించిన నాని మొదటి ప్రయత్నంగా ‘అ..!’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రం తీశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బెస్ట్ మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ అనే రెండు విభాగాలలో నేషనల్ అవార్డ్స్ అందుకోవడం విశేషం. కాగా ఈ బ్యానర్ లో నాని తన రెండవ చిత్రంగా హిట్ మూవీ వచ్చింది.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ ని హిందీ లో రీమేక్ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ చిత్ర రీమేక్ లో హీరో ఖరారు అయ్యింది. రాజ్ కుమార్ రావ్ హీరోగా హిట్ హిందీ రీమేక్ తెరకెక్కనుంది. తెలుగులో తెరకెక్కించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.