
పవన్ కళ్యాణ్ – అలీ ఎంత మంచి స్నేహితులో చెప్పాల్సిన పనిలేదు. పవన్ నటించిన ప్రతి సినిమాలో అలీ ఉండేవాడు..అయితే శాసన సభ ఎన్నికల్లో అలీ వైసీపీ తరుపున ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఫై కాస్త విమర్శలు గుప్పించి పవన్ మనసును , అలాగే అభిమానులను హృదయాలను గాయపరిచారు. ఆ తర్వాత పవన్ అవేమి పట్టించుకోకుండా రాజకీయం వేరు , స్నేహం వేరు అని అన్నారు.
తాజాగా అలీ పవన్ ఫై పొగడ్తల వర్షం కురిపించి అభిమానులను మెప్పించాడు. దీనితో అలీ మరలా పవన్ స్నేహాన్ని కోరుకుంటుంటున్నాడని అర్థం అవుతుంది. ఈ విషయాన్ని పరిశ్రమలో ఇప్పుడు విశేషం గా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ చిత్రం తో పాటు క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు.









