
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కన్ను చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలపై పడినట్లు తెలుస్తుంది. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయినా చిత్రాలనే కాక మన భాషలో మెగా హిట్స్ అయినా చిత్రాలను రీమేక్ చేసేందుకు ఇప్పటికి హీరోలు ఉత్సహం చూపిస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ సైతం చిరు చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.
పనవ్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాతో పాటు చిరంజీవి హీరోగా నటించిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలు వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమాల విషయానికొస్తే.. చిరు కెరీర్లో మంచి హిట్ సినిమాలుగా మిగిలాయి. వీటిని రీమేక్ చేయాలనీ వరుణ్ ప్లాన్ చేస్తున్నాడట. మరి వాటిని ఎప్పుడు రీమేక్ చేస్తారో చూడాలి.









