హరిహర వీరమల్లు టీజర్ వచ్చేది ఆ రోజేనా ?


పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో సూర్య మూవీస్ బ్యానర్ ఫై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొదటిసారి ‘హరిహర వీరమల్లు’ సినిమా ద్వారా పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా బ్రేకులు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

తాజాగా జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా హరిహర వీరమల్లు టీజర్ అనే హాష్ టాగ్ ని ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి, అనసూయ, పూజిత పొన్నాడ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.