తారకరత్న అకాలమరణం.. వాయిదాపడ్డ నందమూరి హీరోల సినిమాలు !


నందమూరి తారకరత్న మరణం నందమూరి హీరోలు-బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్- రాబోయే చిత్రాల షెడ్యూల్‌లను దెబ్బతీసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికం గా NBK108 టైటిల్ ను పెట్టడం జరిగింది. గత డిసెంబర్‌లో ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్‌ను చిత్రీకరించారు. ఆ తర్వాత వీరసింహా రెడ్డి ప్రమోషన్లలో మరియు ఇతర రాజకీయ కార్యకలాపాలతో బిజీగా వున్నారు. ఇక తన తదుపరి షెడ్యూల్‌ని ఈ నెల 23 వ తేది నుండి ప్రారంభించాల్సి ఉండగా అది ఇప్పుడు తారకరత్న అకాలమరణం కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇక మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇక మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ తదుపరి చిత్రం ‘ఎన్టీఆర్ 30’ ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తారకరత్న హఠాన్మరణం కారణంగా ఈ ఈవెంట్‌ను వాయిదా వేసినట్లు మేకర్స్ సోమవారం వెల్లడించారు మరియు కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇక ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన RRR తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.