‘పరేషాన్’ టీజర్‌ రిలీజ్


‘మసూద’తో బిగ్ హిట్ అందుకున్న యంగ్ హీరో తిరువీర్ ఇప్పుడు రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ‘పరేషాన్’అనే హిలేరియస్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకులు శైలేష్ కొలను, వినోద్, శాంటో, ప్రవీణ్, మల్లిక్, ఉదయ్ తో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ చిత్రం తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. అక్కడ స్నేహితుల గ్యాంగ్, వారి జీవితాల్లోని అస్తవ్యస్తమైన పరిస్థితులు, సిల్లీ సంఘటనలు.. చిక్కులు తెచ్చిపెడతాయి. తిరువీర్‌ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో పావని కరణం కనిపించింది. వారు ఎదుర్కొనే సమస్యలు హిలేరియస్ గా వున్నాయి. దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్ పరేషాన్ ని యూనిక్ గా ట్రీట్ చేశారు. టీజర్లో మంచి కంటెంట్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.

రూపక్ రోనాల్డ్‌సన్ తన హ్యుమరస్ రైటింగ్ తో ప్రతి సన్నివేశానికి వినోదాత్మకంగా మలిచారు. తిరువీర్ ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా పోషించగల నటుడని నిరూపించుకుంటున్నాడు. అతను మద్యానికి బానిసైన పాత్రలో జీవించేశాడు.

ఈ చిత్రానికి డీవోపీ వాసు పెండమ్, సంగీతం చౌరస్తా బ్యాండ్‌ యశ్వంత్ నాగ్.. ఇద్దరు టెక్నీషియన్లు తమ తమ పనితనాన్ని అద్భుతంగా కనబరిచారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి హరిశంకర్ ఎడిటర్. టీజర్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.