విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య గొడవకు కారణం అదేనా ?


తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ యాంకర్గా దూసుకుపోతున్న యాంకర్స్ లో హాట్ బ్యూటీ అనసూయ కూడా ఒకరు. గతంలో కొన్ని షోస్ చేసినా కూడా జబర్దస్త్ తో బాగా పాపులర్ అయ్యింది.. ఆ షో తో టాప్ యాంకర్స్ లిస్ట్ లోకి చేరింది. తన అందం అభినయంతో సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా అందుకుంది. అలా సుకుమార్ ,రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఒకవైపు సినిమాలు మరోవైపు షోస్ తో ఫుల్ బిజీ అయ్యిపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు మైండ్ బ్లాక్ చేస్తుంది.

ఇకపోతే కెరీర్ పరంగా దూసుకుపోతున్న కూడా మరో వైపు తనకు ఎటువంటి సంబంధం లేని విషయాల్లో కూడా తల దూరుస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలను కూడా అస్సలు వదలకుండా ట్రోల్స్ చేస్తుంది. దాంతో వివాదాలను కూడా తెచ్చుకుంటుంది. ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేసింది. అది ఎంత దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ ఫాన్స్ వర్సెస్ అనసూయ వార్ తో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. అసలు ఎందుకు గెలికిందో తెలియదు. కానీ ఇప్పుడు దారుణమైన ట్రోల్స్ కు గురైంది. వరుస ట్వీట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

నిజానికి ఈ వార్ ఇప్పుడు మొదలైంది కాదు. విజయ్ దేవరకొండను ఓవర్నైట్ స్టార్ ను చేసిన అర్జున్ రెడ్డి సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గుమంటుంది. అప్పుడు కొన్ని చర్చల అనంతరం ఆ గొడవ సర్దుమణిగిన కూడా ఇప్పుడు మళ్ళీ మొదలైంది. తాజాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో విజయ్ దేవరకొండ పేరు ది విజయ్ దేవరకొండ అని అయితే ఉంది. ఇక ఆ విషయంపై అనసూయ స్పందిస్తూ.. “ఇప్పుడే నేను ఒకటి చూశాను. ‘ది’ నా.. బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం అంటూ” ఒక పోస్ట్ షేర్ చేసారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ మధ్య మళ్లీ ట్వీట్స్ యుద్ధం మొదలయ్యింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. ప్రస్తుతం యాంకరింగ్ కు దూరంగా ఉన్న అనసూయ సినిమాలతో బిజీగా ఉంది.