NTR31 నుండి అదిరే అప్డేట్..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో NTR 30వ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ నిన్ననే ఈ సినిమా టైటిల్ ను ‘దేవర’ అని ప్రకటించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయకిగా నటిస్తుంది. ఇకపోతే గతంలోనే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ‘NTR31’ ను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

అయితే తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా NTR31 నుండి కూడా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ కి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అవైటింగ్ ప్రాజెక్ట్ షూటింగ్ 2024 మార్చ్ నుంచి మొదలవ్వబోతుందని ప్రకటించింది చిత్రబృందం. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాతో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే వీరి కాంబో సెట్స్ మీదకు వెళ్లనుంది. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులకు బర్త్ డే ట్రీట్ అదిరిపోయిందిగా.