మెలోడీ బీట్ తో రొమాన్స్ చేస్తోన్న ‘మిస్ట‌ర్ ప్రెగ్నెంట్’..


బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలకు సోషల్ మీడియాలో సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమా నుండి ‘హే చెలి..’ అనే ఆహ్లాద‌క‌ర‌మైన మెలోడీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇక ఈ పాటను వింటుంటే చల్లటి చిరుగాలి మనసుని తాకినట్లుగా ఉంటుంది. “హే చెలి.. అడిగాను కౌగిలి.. తీయ‌గా తీరాలి ఈ చ‌లి..” అంటూ ప్రేమికుడు త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను ప్రేయసికి చెబుతూనే ఆమెను కొంటెగా క‌వ్విస్తున్నారు. అస‌లు ఈ ప్రేమికులు ఎవ‌రు? వారేం చేశార‌నే విష‌యాలు తెలియాలంటే ‘మిస్ట‌ర్ ప్రెగ్నెంట్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. విజువ‌ల్స్ ఆ ట్యూన్‌ కు అనుగుణంగా అద్భుతంగా ఉన్నాయి. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని పాట‌ను శ్రీమ‌ణి రాశారు.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

ప్రస్తుతం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్యక్రమాలు జ‌రుపుకుంటోన్న ఈ మూవీ ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు నటిస్తున్నారు.