
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా ఎం.జీ. శ్రీనివాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ఘోస్ట్. అక్టోబర్ 19న కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ‘ఘోస్ట్’ తెలుగు వర్షన్ ని మొదటగా అక్టోబర్ 27న విడుదల చేయాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్ ను రిలీజ్ చేయడానికి కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్.
‘ఘోస్ట్’ మూవీ తెలుగు వర్షన్ ని నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇకపోతే ఈ సినిమాను సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్‌లో అలరించనున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి అర్జున్ జన్య సంగీతం అందించారు.










